News September 5, 2025
టెక్కలి: విద్యార్థుల ప్రతిభకు ఈయన పాఠాలే మూలం

ఉపాధ్యాయుడిగా కాకుండా కళాకారుడు, చిత్రకారుడు, మైమ్ ఆర్టిస్ట్, నృత్యకారుడు, ప్రజాఉద్యమకారుడు, నాటక రచయిత తదితర రంగాల్లో డీఏ స్టాలిన్ తనదైన ముద్ర వేశారు. టెక్కలికి చెందిన ఈయన 1983-2018 వరకు టీచర్‌గా పని చేశారు. పిల్లలను ప్రతిభావంతులను చేసేందుకు బొమ్మాలాటలతో విద్యనందించారు. ఇందుకు 2008లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
Similar News
News September 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

☛ ఆమదాలవలసలో వివాహిత సూసైడ్
☛రణస్థలం: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
☛టెక్కలి: నిర్లక్ష్యం.. నేడు శాపం అవుతోందా?
☛పలాస: ఆటో ఢీకొని యువకుడు మృతి
☛ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనది: కలెక్టర్
☛మందస: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
☛నరసన్నపేట: బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం
☛గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే కూన రవి కుమార్
News September 5, 2025
ఆమదాలవలసలో వివాహిత సూసైడ్

ఆమదాలవలస మండలం చిట్టివలసకు చెందిన పూర్ణ (22) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 4 నెలల కిందట ఈమెకు వివాహమైంది. అప్పటి నుంచే ఆమె వరకట్న వేధింపులను తాళలేక పుట్టింటికి వచ్చేసింది. అనంతరం పెద్దల సమక్షంలో అత్తారింటికెళ్లిన పరిస్థితి మారలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదైంది.
News September 5, 2025
‘ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సహాయక బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు ఈనెల 7న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపైన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,186 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు.