News March 21, 2025
టెక్కలి: విద్యార్థుల సహనానికి “పరీక్ష”

టెక్కలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులు మండుటెండలో అవస్థలు పడ్డారు. ఉదయం 8.45 గంటలకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో మండుటెండలో నిలబడ్డారు. అధికారుల తీరుపై కొంత మంది తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విద్యార్థులను లోపలికి అనుమతించారు.
Similar News
News March 23, 2025
క్షయరహిత సమాజానికి కృషి చేస్తాం: డీఎంహెచ్ఓ

క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డా. బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలపై శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్షయ అంటువ్యాధి అని, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాది వ్యాప్తి చెందుతుందన్నారు.
News March 22, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News March 22, 2025
సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్‌లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.