News November 18, 2025

టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

image

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.

Similar News

News November 18, 2025

దడ పుట్టిస్తున్న వానరాలు.. వేములవాడలో కోతులతో పరేషాన్

image

వేములవాడ ఆలయంలో కోతులు హల్‌చల్ చేస్తున్నాయి. పట్టణంలో కొంతకాలంగా కోతుల సంచారం ఎక్కువైంది. ముఖ్యంగా భక్తుల సంచారం అధికంగా ఉండే ఆలయ పరిసరాల్లో వానరాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఆలయ ముఖ్య బుకింగ్ కౌంటర్ క్యూలైన్లో కోతులు వాటికి కావాల్సిన ఆహారం కోసం అటుఇటు తిరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు వస్తుండడంతో క్యూలైన్లలోని భక్తులు భయపడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో భారీగా పంట నష్టం

image

మొంథా తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 162 ఎకరాల్లో అరటి, కూరగాయలు, 2,360 ఎకరాలకు పైగా వరి, పత్తి దెబ్బతిన్నాయి. పంట నష్టంగా రైతులకు మొత్తం రూ.12.38 కోట్లు పరిహారం అందజేయాలని కోరుతూ సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.