News March 11, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 12, 2025
నల్గొండ: భర్తను హత్య చేసిన భార్య

ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శివరాం రెడ్డి వివరాలిలా.. ఉస్మాన్‌పురకు చెందిన అక్సర్ జహ, చర్లగౌరారంలోని ZPHSలో అటెండర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ఖలీల్ హుస్సేన్ దంపతులు. గత నెల 25న ఖలీల్ హుస్సేన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 7న నిర్వహించిన పోస్టుమార్టంలో మృతుడు హత్యకు గురయ్యాడని తేలడంతో విచారించగా భార్య నేరం ఒప్పుకుంది.
News March 12, 2025
నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్‌కు 326 ర్యాంకు వచ్చింది.
News March 12, 2025
ఆ కుటుంబానికి గ్రామస్థులంతా అండగా నిలిచారు

నార్కట్‌పల్లి మండలం చిప్పలపల్లిలో ఇటీవల అనారోగ్యంతో వలిగొండ శంకరయ్య భార్య పద్మ మరణించారు. ఈ విషాద సమయంలో గ్రామస్థులు పెద్ద మనసుతో స్పందించి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకరయ్య కుటుంబానికి రూ.1,15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మానసిక ఆత్మబలాన్ని ఇచ్చారు. గ్రామీణ సమాజంలో అండగా నిలిచిన ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.