News March 18, 2025

టెక్ సపోర్ట్ స్కామ్ పట్ల జాగ్రత్త: అన్నమయ్య SP

image

టెక్ సపోర్ట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఒక ప్రకటన విధులు చేశారు. టెక్ సపోర్ట్ స్కామ్ అనేది ఒక రకమైన మోసం, ఇందులో మోసగాళ్లు ప్రముఖ టెక్ కంపెనీల (ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటివి) సాంకేతిక మద్దతు సిబ్బందిగా నటిస్తారన్నారు. వారు మీ కంప్యూటర్ లేదా ఇతర పరికరాలలో సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తామని మోసం చేస్తారన్నారు.

Similar News

News September 17, 2025

నల్గొండ: భూస్వామ్య కుటుంబంలో పుట్టి వారినే ఎదిరించాడు

image

నిజాం అనుచరులను ఎదిరించడంలో వేములపల్లి (M) రావులపెంట దళం ప్రధాన పాత్ర పోషించింది. అక్రమ వసూళ్లు, హత్యలు,అత్యాచారాలతో విసిగిన ప్రజలు తిరగబడ్డారు. రావులపెంట భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సీతారాంరెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేసి దాడులు చేశారు. గ్రామంలోని కోటబురుజును కేంద్రంగా చేసుకొని పాములపాడు, ఆమనగల్లులో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను తరిమికొట్టారు.

News September 17, 2025

భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం వివరాలివే!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 205.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ 39.4, పలిమెల 10.6, మహముత్తారం 18.6, కాటారం 34.8, మల్హర్ 3.6, చిట్యాల 8.2, టేకుమట్ల 26.8, మొగుళ్లపల్లి 11.0, రేగొండ 11.4, గణపురం 14.8, భూపాలపల్లి 26.2 మి.మీ.లుగా నమోదైంది.

News September 17, 2025

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

image

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.