News January 2, 2026
టెట్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: సూర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు జరిగే టెట్ పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండొద్దని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
Similar News
News February 12, 2026
కృష్ణా: పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో B.A.LL.B చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. FEB 20, 23, 25, 27 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 70 మార్కులకు వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
News February 12, 2026
VIRAL: ₹300తో కొని ₹634కోట్లకు అమ్మాడు!

మలేషియాకు చెందిన కింగ్ అర్స్యాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం ₹300తో ‘ai.com’ అనే డొమైన్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏఐకి పెరిగిన క్రేజ్ వల్ల ఈ డొమైన్‌ను ఇస్మాయిల్ ఒక క్రిప్టో సంస్థకు ఏకంగా ₹634 కోట్లకు విక్రయించారు. కామ్ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఈ డొమైన్‌ను దక్కించుకున్నారు. గతంలో దీనిని ‘OpenAI’ కూడా వాడుకుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభం పొందిన అరుదైన డీల్‌గా ఇది నిలవడం విశేషం.
News February 12, 2026
పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పేషీలో కలిశారు. నియోజకవర్గ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


