News January 5, 2026
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: దీపక్ తివారి

టెన్త్‌లో వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ASF జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులతో విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, పరీక్షల దృష్ట్యా ప్రత్యేక బోధన అందించాలని సూచించారు.
Similar News
News February 2, 2026
సంగారెడ్డి: ఎద్దుల ధర సంచలనం.. రూ.3.40 లక్షలు

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులో దర్గా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పశువుల జాతరలో వివిధ జాతుల ఎద్దులు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి వచ్చాయి. దియోని, ఒంగోలు, కిల్లర్ జాతుల పశువులు ఆకర్షణగా నిలిచాయి. ధరలు రూ.50 వేల నుంచి రూ.3.40 లక్షల వరకు పలికాయి. రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News February 2, 2026
పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల వారికి SBI, RSETI ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నేటి నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. 19-45 ఏళ్ల లోపు ఉన్నవారు టెన్త్ మెమో,ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్, 3 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
News February 2, 2026
రూ.9.8 కోట్ల లెక్కలేవి? KCRకు సిట్ ప్రశ్న!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ముందు సిట్ అధికారులు కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంటెలిజెన్స్ టీం అత్యాధునిక పరికరాలు వాడిందని, వాటి విలువ దాదాపు రూ.9.8 కోట్ల వరకు ఉంటుందని కేసీఆర్ ముందు వివరాలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరికరాల కొనుగోలు లెక్కల గురించి ఆయనను సిట్ ప్రశ్నించగా ఈ విషయం తనకు తెలియదంటూ KCR సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.


