News October 21, 2024
టెన్త్లో టాపర్.. ఇంటర్లో ఇలా..!

బద్వేల్ ఘటనలో మృతిచెందిన యువతి గురించి అనేక విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు తల్లి, తండ్రి, సోదరుడు ఉన్నాడు. యువతి తండ్రి రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ చదివించారు. యువతి బద్వేల్ జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదవగా.. 556 మార్కులతో టాపర్గా నిలిచింది. ఇంటర్లో కూడా యువతి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కాలేజీకి వచ్చేదని.. మంచి భవిష్యత్తు ఉన్న యువతికి ఇలా జరగడం బాధాకరమని ఇంటర్ కాలేజీ లెక్చరర్ పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
News November 6, 2025
జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.
News November 6, 2025
22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జేసీ

జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.


