News January 10, 2026

టెన్త్‌లో 100% ఫలితాలే లక్ష్యం: కలెక్టర్‌ తేజస్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో సూర్యాపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా ఎంఈఓలు కృషి చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, 2 ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థికి అభ్యాసన దీపికాలతో పాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Similar News

News February 2, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన యూపీ ప్రభుత్వం

image

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ షాకిచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని 68వేల మంది ఎంప్లాయిస్ జీతాలను నిలిపివేసింది. మానవ సంపద పోర్టల్‌లో గవర్నమెంట్ ఉద్యోగుల స్థిర, చరాస్తుల వివరాల వెల్లడికి JAN-31 వరకు గడువు ఇచ్చింది. అయితే ఆ వివరాలను అప్‌లోడ్ చేయని 34,926 మంది గ్రూప్-C, 22,624 మంది గ్రూప్-D, 7,204 మంది గ్రూప్-B, 2,628 మంది గ్రూప్-A అధికారుల శాలరీలను సర్కారు ఆపేసింది.

News February 2, 2026

గోధుమ పిండి దీపంతో వివాదాల పరిష్కారం

image

అనుకోని వివాదాలు, కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఈ దీపారాధన వల్ల శత్రు చికాకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్య గ్రహ దోషాలు ఉన్నా, అధికారులతో ఇబ్బందులు ఎదురైనా గోధుమ పిండి దీపం ఉపశమనాన్ని ఇస్తుంది. మనశ్శాంతిని ప్రసాదించి, క్లిష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. సమస్యల తీవ్రత తగ్గాలనుకునే వారు ఈ దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించాలి.

News February 2, 2026

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

image

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్‌ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.