News February 12, 2025

టెన్త్ అర్హతతో 55 ఉద్యోగాలు

image

10th అర్హతతో గుంటూరు జిల్లా(డివిజన్‌లో) 55GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News March 6, 2026

విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటాం: SP

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ పొలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

News March 6, 2026

ఈ నెల 10న జడ్పీలో జన్ సున్ వాయ్: GNT కలెక్టర్

image

జన్ సున్ వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. 10న ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వినతులు, పెండింగ్ అంశాలను స్వీకరించడం జరుగుతుందన్నారు.

News March 6, 2026

పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్ లక్ష్యాలు 100% అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో శుక్రవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. 100% పెర్ఫార్మెన్స్ సాధించడానికి గల కారణాలు, తక్కువ పెర్ఫార్మెన్స్ రావటానికి గల కారణాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలన్నారు.