News March 14, 2025

 టెన్త్ ఎగ్జామ్స్‌..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.

Similar News

News March 9, 2026

T20WCలో భారత్ సరికొత్త చరిత్ర

image

* 3 T20WCలు సాధించిన తొలి జట్టు(2007, 2024, 2026).
* స్వదేశంలో టైటిల్ సాధించిన ఫస్ట్ టీమ్
* ఫైనల్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం- 98 రన్స్
* నాకౌట్ మ్యాచుల్లో వేగంగా(7.2 ఓవర్లలో) 100 రన్స్
* పవర్ ప్లేలో అత్యధిక రన్స్ 92(విండీస్‌తో సమంగా)
* టాప్-3 బ్యాటర్లు(శాంసన్, అభిషేక్, ఇషాన్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

News March 9, 2026

PHOTOS: టీమ్‌ఇండియా సంబరాలు

image

2023 ODI WC ఓడిన చోటే(అహ్మదాబాద్ స్టేడియం) టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. ఆ గ్రౌండ్ కలిసిరాదని చాలా మంది గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారత జట్టు విజయకేతనం ఎగరవేసింది. ట్రోఫీ అందుకున్న అనంతరం ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.

News March 9, 2026

NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో జిల్లా వాసులకు మెడల్స్

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు మెడల్స్ సాధించారు. థాయిలాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోపి 110 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్, 4×100, 4×400 రిలేలో 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. రఘువీర్ హ్యమర్‌త్రోలో సిల్వర్ మెడల్, షాట్ పుట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుపొందారు. దినేశ్ వాగ్మారే 4×100, 4×400 రిలేలో 2 సిల్వర్ మెడల్స్ సాధించారు.