News January 7, 2026
టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు లాస్ట్ ఛాన్స్

TG: టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. తత్కాల్ విధానంలో ₹వెయ్యి లేట్ ఫీజుతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. ఆయా తేదీల్లో స్కూల్ HMలకు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. హెడ్మాస్టర్లు 28వ తేదీ లోపు చలానా రూపంలో కట్టాలని, 29వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలంది. ఇదే చివరి అవకాశం అని, మరోసారి గడువు పొడిగించబోమని వివరించింది.
Similar News
News January 28, 2026
న్యూజిలాండ్ భారీ స్కోర్

విశాఖలో భారత్‌తో జరుగుతున్న 4వ టీ20లో న్యూజిలాండ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు సీఫర్ట్(62), కాన్వే(44) విజృంభించారు. ఫిలిప్స్ 24 పరుగులతో రాణించారు. చివర్లో మిచెల్(39*) వేగంగా పరుగులు రాబట్టారు. అర్ష్‌దీప్, కుల్దీప్ చెరో 2, రవి బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. రింకూ 4 క్యాచ్‌లు అందుకున్నారు. IND గెలవాలంటే 216 పరుగులు చేయాలి.
News January 28, 2026
గెలుపు గుర్రాలపై గులాబీ గురి

TG: 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈనెల 30తో ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో గెలిచేవారినే పార్టీ అభ్యర్థులుగా నిలపాలని BRS నిర్ణయించింది. అలాంటి వారిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది నాయకులకు అప్పగించింది. ఎంపికతో పాటు పార్టీ గెలుపు వ్యూహాలనూ అమలు చేయాలని వారిని ఆదేశించింది. అధికార INC నేతల కదలికలను గమనిస్తూ అధిష్ఠానాన్ని అప్రమత్తం చేయాలని సూచించింది.
News January 28, 2026
అపార్ట్‌మెంట్ బాల్కనీలో మొక్కలు పెంచుతున్నారా?

అపార్ట్‌మెంట్ బాల్కనీలో పెంచే మొక్కలు ఇంటి అందంతో పాటు వాస్తు శ్రేయస్సును కూడా పెంచుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరిస్తున్నారు. తులసి, బిల్వం, పసుపు, సువాసనలు వెదజల్లే గులాబీ, మల్లె, జాజి మొక్కలు నాటాలంటున్నారు. ‘ఇవి ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఎంతో మేలు చేస్తాయి. మనీప్లాంట్, తమలపాకు తీగలను కింది నుంచి పైకి పాకేలా చేస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


