News March 18, 2025
టెన్త్ పరీక్షలు.. నల్గొండ డీఈవో ముఖ్య గమనిక

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై ఇదివరకే అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయం వీడి మంచిగా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News March 18, 2025
NLG: జిల్లాలో పుంజుకున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ

నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేఅవుట్ రెగ్యులర్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించినందుకు గత ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. మార్చి 31 లోగా రెగ్యులరైజ్ చేసుకుంటే ఫీజులు 25% రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతమైంది.
News March 18, 2025
NLG: జూనియర్ కాలేజీల్లో బోధన కష్టాలు గట్టెక్కినట్టే!

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల కొరత తీరనున్నది. గత 13 ఏళ్లుగా పూర్తిస్థాయి అధ్యాపకులు లేక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అంతంత మాత్రంగానే సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టడంతో జిల్లాకు సుమారు 50 మంది వరకు కొత్త అధ్యాపకులు రానున్నట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత తీరనుండడంతో బోధన కష్టాలు ఇక గట్టెక్కనున్నాయి.
News March 18, 2025
NLG: ముమ్మరంగా ఇంటింటా LCDC సర్వే

కుష్టు వ్యాధిని సమాజం నుంచి పూర్తిస్థాయిలో పారదోలాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (LCDC) చేపట్టింది. 2017 నుంచి సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించే ఈ సర్వేను సోమవారం జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఈ నెల 30వ తేదీ వరకు సర్వేను పూర్తి చేయనున్నారు. సర్వే కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 1,466 బృందాలను ఏర్పాటు చేసింది.