News January 20, 2026
టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్‌ను MAR 16-APR 1 వరకు నిర్వహిస్తామని SSC బోర్డు 2025 NOVలో వెల్లడించింది. MAR 20న ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో GOVT సెలవు ప్రకటించింది. దీంతో పరీక్షను MAR 21న జరిపే ఛాన్స్ ఉంది. కాగా కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ‘Way2News’కి తెలిపారు.
Similar News
News February 16, 2026
నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.
News February 16, 2026
పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.
News February 16, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


