News March 21, 2025
టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థులు, హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
NLG: వాహనదారులకు శుభవార్త చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల మీద తిరిగే వాహనదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త చెప్పారు. గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారుల రోడ్లకు టోల్ ఫీజు వసూలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు.
News March 22, 2025
NLG: టెన్త్ పేపర్ లీక్.. ఇన్విజిలేటర్ సస్పెండ్

నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్‌లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్‌ను డ్యూటీ నుంచి తొలగించి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు MEO నాగయ్య తెలిపారు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామన్నారు.
News March 22, 2025
నల్గొండ మహిళల కోసం జాబ్ మేళా

శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో NLG ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ITI, పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన మహిళలు 18 సం.ల నుంచి 33 సంవత్సరాల లోపు వారు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాసరాజు తెలిపారు.