News April 24, 2024
టెన్త్ ఫలితాల్లో.. రాష్ట్రంలో కర్నూలు జిల్లానే చివరి స్థానం

టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మెుత్తం 30802 మందికి 19242 మంది పాసయ్యారు.62.47 ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. బాలురు 16276 మందికిగాను 9313మంది, బాలికలు 14526 మందికిగాను 9929 మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లాలో 23787 మందికి గాను 20367 మంది పాసయ్యారు. 85.62ఉత్తీర్ణత శాతంతో 19వ స్థానంలో నిలిచింది. బాలురు 12283 మందికిగాను 10216.. బాలికలు 11504కు గాను 10151 మంది పాసయ్యారు.
Similar News
News April 8, 2026
కర్నూలు: ఈతకు వెళ్లి 8వ తరగతి విద్యార్థి గల్లంతు

కర్నూలు జిల్లా సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి తెలుగు మధు మంగళవారం చెరువు సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మంగళవారం సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రంగమ్మ, మద్దిలేటి వెతకగా బావి వద్ద కుమారుని దుస్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న జాలర్లు బావిలో గాలించినా మధు ఆచూకీ లభించలేదు. కుమారుని పరిస్థితి తలచుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
News April 8, 2026
కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం

కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News April 7, 2026
పరిశ్రమల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. మంగళవారం పరిశ్రమల పురోగతిపై యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల స్థితిగతులను ఆరా తీసిన కలెక్టర్.. ఎదురయ్యే సమస్యలను వెంటనే తెలియజేయాలని చెప్పారు. అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, పనులు వేగంగా పూర్తి చేస్తామని యాజమానులు వెల్లడించారు.


