News April 23, 2025

టెర్రరిస్టుల దాడిని ఖండించిన నారాయణపేట ఎమ్మెల్యే

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి తెలిపారు. మరికల్ మండలం అప్పంపల్లిలో ఆమె మాట్లాడారు. తీవ్రవాదులు సామాన్య జనాలపై దాడులు నిర్వహించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరన్న, సూర్య మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News April 23, 2025

ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: హరీశ్ రావు

image

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు X ద్వారా వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వేడుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 23, 2025

ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

image

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.

News April 23, 2025

NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కార్మికులు చిక్కుకొని నేటికీ 60 రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు చేపట్టిన సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 12 కంపెనీలకు చెందిన 700మంది సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ అందులో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ నేటికీ లభించలేదు. ఈనెల 24న సహాయక చర్యలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!