News April 18, 2025

టేకుమట్ల: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టపూర్(వి) గ్రామానికి చెందిన పెండం సదానందం (51) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సదానందం కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

Similar News

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

News April 19, 2025

మేలో మరో ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

image

మే నెల 22వ తేదీన ‘GSLV F-16’ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఓదెల 41.5℃ నమోదు కాగా అంతర్గం 41.3, సుల్తానాబాద్ 40.7, పాలకుర్తి 40.6, పెద్దపల్లి 40.6, రామగుండం 40.1, ఎలిగేడు 40.0, జూలపల్లి 39.7, కమాన్పూర్ 39.6, రామగిరి 39.5, మంథని 39.3, ధర్మారం 39.3, కాల్వ శ్రీరాంపూర్ 39.2, ముత్తారం 39.8℃ గా నమోదయ్యాయి.

error: Content is protected !!