News March 20, 2024
టేక్మాల్: చెరువులో దూకి వృద్ధ మహిళ ఆత్మహత్య

టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నీరుడి కిష్టమ్మ(70) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన కిష్టమ్మ కుడి చెంపపై కంతి ఏర్పడి దుర్వాసన వస్తుంది. దాని కారణంగా ఆమె వద్దకు ఎవరు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈరోజు మధ్యాహ్నం టేక్మాల్ పంతులు చెరువులో దూకి కిష్టమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.
Similar News
News September 4, 2025
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

నర్సాపూర్లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.
News September 4, 2025
మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక: డీఈవో

మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు డీఈవో ప్రొ. రాధాకిషన్ తెలిపారు. ఈనెల 6న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ ఉపాధ్యాయులున్నారని డీఈవో వివరించారు.
News September 4, 2025
మెదక్: సీఎం వస్తారనుకున్నారు… కానీ రావట్లేదు..!

భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదం కనులారా వీక్షించి కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు సీఎం వస్తాడని ఆశించిన అన్నదాతలు ఆవిరయ్యాయి. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పోచారం ప్రాజెక్ట్ సందర్శిస్తారని ప్రచారం జరిగింది. పర్యటన షెడ్యూల్ లో లేకపోవడంతో నిరాశ చెందారు. వందలాది ఎకరాల పంట, రోడ్డు, ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తీరని నష్టం మిగిలింది. సీఎం వస్తే కొంత ఉపశమనం కలిగేదని ఆశించారు.