News March 21, 2024
టేక్మాల్: మహిళా హత్య !

టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామంలో దుబ్బగళ్ళ సంగమ్మ(44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొద్ది నెల క్రితం భర్త మృతిచెందగా.. కొడుకు హైదరాబాదులో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి ఇంట్లో పడుకున్న సంగమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
Similar News
News April 9, 2026
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సు నిర్వహించబడుతుందన్నారు. 10వ తరగతి అర్హతతో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది డిప్లొమాలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 8, 2026
మెదక్: పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన రోడ్లు కోర్టు బిల్డింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు నెలకొన్న పక్షంలో పరిష్కరించుకొని తద్వారా ముందుకు పోవాలన్నారు.