News November 4, 2025
టైం పాస్ కోసం జగన్ నకిలీ యాత్ర: TDP

వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై TDP ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. బెంగళూరులో సేద తీరిన గెస్ట్ పొలిటీషియన్ సరదాగా టైం పాస్ చేయటానికి ఒక నకిలీ యాత్ర పెట్టుకున్నాడు’ అని విమర్శించింది. ఎలాగూ ప్రజలు తిరస్కరిస్తారు కాబట్టి జనాలకి ఒక్కొక్కరికీ రూ.1000, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి నకిలీ యాత్ర చేస్తున్నాడని సెటైర్లు వేసింది. దీనిపై మీ కామెంట్.
Similar News
News November 4, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.
News November 4, 2025
సంగారెడ్డి: ఉన్నత చదువులు.. 30 మంది టీచర్లకు అనుమతి

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 30 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.


