News November 10, 2025

టైక్వాండో పోటీల్లో కర్నూలు విద్యార్థుల విజయం

image

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ డా. ఏ. సిరి అభినందించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన అండర్–19 విభాగంలో సుగందిని వెండి, ఇంద్రాణి కాంస్య పతకాలు గెలిచారు. ఏలూరులో జరిగిన అండర్–17 విభాగంలో లేఖ్యశ్రీ చందన వెండి, నక్షత్ర, రేవంత్ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను ప్రోత్సహించిన కోచ్ షబ్బీర్ హుస్సేన్‌ను కలెక్టర్ అభినందించారు.

Similar News

News November 10, 2025

కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు

image

ఈ నెల 11న కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో ఆమె ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీఐఐసీ, విమానాశ్రయం, పర్యటక శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 10, 2025

కర్నూలు: డయల్ యువర్ APSPDCL సీఎండీ

image

ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ APSPDCL సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూల్, నంద్యాల జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. 8977716661 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News November 10, 2025

కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.