News September 4, 2025

టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ-క్రాప్ నమోదు ఆధారంగా టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంటలు సాగుచేసిన వివరాలు, ఆ పంటలు జాబితా వాటికి అవసరమయ్యే యూరియా మోతాదును డివిజన్, మండల, రైతు సేవ కేంద్రాల వారిగా నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News September 4, 2025

కుల్కచర్ల: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేశ్

image

కుల్కచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉప్పరి రమేశ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు బోధనలో ప్రతిభ చూపడంతో జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.

News September 4, 2025

టెక్ దిగ్గజాలకు ట్రంప్ డిన్నర్.. మస్క్‌కు నో ఎంట్రీ

image

టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ కంపెనీల ఫౌండర్లు, CEOలకు US అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రికి డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి బిల్‌గేట్స్, టిమ్ కుక్, జుకర్‌బర్గ్, పిచాయ్, సత్య నాదెళ్ల, ఆల్ట్‌మన్ తదితరులు హాజరుకానున్నారు. అయితే మస్క్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ట్రంప్ అధికారం చేపట్టాక ఆయనకు కీలక పదవి ఇవ్వగా, తర్వాత ఇద్దరికీ చెడింది. దీంతో మస్క్‌ను ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు.

News September 4, 2025

కూటమి ప్రభుత్వంపై హరిరామ జోగయ్య ప్రశంసలు

image

AP: కూటమి ప్రభుత్వంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర నేపథ్యంలో ఆయన లేఖ రాశారు. వీరి నాయకత్వంలో మరో పదేళ్లలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.