News February 15, 2026
టోల్ వసూలు రూల్స్‌లో మార్పులు.. నేటి నుంచే!

నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ వసూలు రూల్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. దీంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవే

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,44,600 పలుకుతోంది. అదే సిల్వర్ విషయానికి వస్తే కేజీ ధర రూ.2,80,000గా కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.
News February 15, 2026
అమెరికన్ ప్లేయర్స్‌కు చైనా సీక్రెట్‌గా ₹116 కోట్లు!

USలో పుట్టి చైనా తరఫున ఆడుతున్న స్టార్ స్కీయర్ ‘ఐలీన్ గూ’, మరో ప్లేయర్ ‘జూ యీ’కు డ్రాగన్ దేశం రహస్యంగా 3ఏళ్లలో ₹116 కోట్లు చెల్లించినట్లు WSJ పేర్కొంది. ద్వంద్వ పౌరసత్వంపై విమర్శలు రాకుండా, విదేశీ క్రీడాకారులకు భారీ నిధులు ఇస్తున్నారన్న ప్రజల అసంతృప్తిని తొక్కేయడానికి అధికారులు ఆమె పేరును బడ్జెట్ రికార్డుల నుంచి తొలగించారు. నేషనల్ ప్రెస్టీజ్ కోసమే చైనా ఇంతలా ఖర్చు చేస్తోందనే వాదన వినిపిస్తోంది.
News February 15, 2026
ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో

ఈసారి శివరాత్రి ఆదివారం రావడంతో పబ్లిక్ హాలిడే అదే రోజు వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు జాగరణ చేసి తర్వాతి రోజు డ్యూటీ చేయడం కష్టమని ఏపీ ప్రభుత్వం సోమవారం <<19142894>>ఆప్షనల్ హాలిడే<<>> ఇచ్చింది. దీంతో కొందరు ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం ఉంది. స్కూళ్లు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సెలవు (ఆప్షనల్ సహా) ప్రకటించలేదు.


