News July 4, 2025
ట్యాంక్‌బండ్‌లో దూకిన మహిళ.. కాపాడిన యువకుడు

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాలు.. రామంతాపూర్‌కు చెందిన మహిళ శుక్రవారం ట్యాంక్‌బండ్ మీదకు వచ్చింది. ఒక్కసారిగా నీటిలో దూకేసింది. ఇది గమనించిక ట్యాంక్‌బండ్ శివ కుమారుడు హుస్సేన్‌సాగర్‌లోకి దిగారు. నీటిలో మునుగుతున్న ఆమెను బ్లూ కోట్ పోలీసుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మహిళ సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News July 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 5, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.25 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 5, 2025
శుభ సమయం (05-07-2025) శనివారం

✒ తిథి: శుక్ల దశమి సా.6.20 వరకు తదుపరి ఏకాదశి
✒ నక్షత్రం: స్వాతి రా.8.00 వరకు తదుపరి విశాఖ
✒ శుభ సమయం: ఉ.10.30-మ.12.00 వరకు, మళ్లీ సా.5.39-6.27 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36
✒ వర్జ్యం: రా.2.13-3.59
✒ అమృత ఘడియలు: ఉ.10.16-మ.12.02
News July 5, 2025
20 బైకులను ప్రారంభించిన నెల్లూరు SP

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.