News March 13, 2025

ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

image

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 13, 2025

ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్

image

AP: ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.

News March 13, 2025

2025లో చంద్రగ్రహణం లేదు: కడప అర్చకులు

image

ఈ నెల 14వ తేదీ చాలామంది చంద్రగ్రహణం ఉందని భావిస్తున్నారు. కానీ 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదని విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా అర్చక పురోహితులు విజయ భట్టర్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. పండితులు సిద్ధాంతాలు పంచాంగ కర్తలు ప్రకారం ఈ సంవత్సరంలో ఎటువంటి సూర్య, చంద్ర గ్రహణాలు మన దేశానికి వర్తించవని స్పష్టం చేశారు.

News March 13, 2025

హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?

image

హోలి వేడుకల్లో కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రంగులు కళ్లలో పడితే కంటి వాపు, మసకబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక చర్మంపై పడితే పొడిబారడం, దురదలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తే శ్వాస, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వాడాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!