News March 13, 2025

ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

image

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 14, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల హోలి విషెస్

image

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని CBN ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.

News March 14, 2025

HMDA పరిధిలోకి నల్గొండ ప్రాంతాలు

image

హెచ్ఎండీఏ పరిధి విస్తరణను తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి.. ఈ మూడు మండలాలలోని 11 గ్రామాలను కలిపారు.

News March 14, 2025

భీమ్‌గల్: మహిళ ఆత్మహత్య

image

ఆత్మహత్య చేసుకోని మహిళ మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలం చేంగల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ ప్రకారం.. శారద అనే మహిళ కూతురితో చేంగల్‌లో నివాసం ఉంటుంది. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు తానే చుసుకుంటోంది. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 12న నాప్తలీన్ బాల్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆర్మూర్ ఆస్పత్రిలో చేర్చగా ఈ నెల 13న మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!