News February 1, 2026
ట్యాక్స్ మిస్టేక్స్.. శిక్షల నుంచి రిలీఫ్!

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు కొన్ని విషయాల్లో ఊరట కల్పించారు. అప్పీల్‌కు ముందు కట్టాల్సిన ప్రీపేమెంట్‌ను 20% నుంచి 10%కి తగ్గించారు. రీఅసెస్‌మెంట్ మొదలైనా 10% అదనపు పన్నుతో రిటర్న్స్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ₹20 లక్షల లోపు విదేశీ ఆస్తులను వెల్లడించకపోయినా జైలు శిక్ష ఉండదు. అసెస్‌మెంట్, పెనాల్టీలకు ఒకే ఆర్డర్ వస్తుంది. తప్పుగా రిపోర్ట్ చేసినా 100% అదనపు ట్యాక్స్ కడితే శిక్షలు ఉండవు.
Similar News
News February 5, 2026
పాకిస్థాన్‌లో టాప్-1లో నిలిచిన ‘ధురంధర్’

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ OTTలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ గత నెల 30న Netflixలో విడుదలై కేవలం 3 రోజుల్లోనే 7.6M వ్యూస్ సాధించింది. ‘యానిమల్’ (6.2M), ‘ఫైటర్’ (5.9M), ‘పుష్ప-2’ (5.8M) రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు OTTలోనూ దూసుకుపోతోంది. 7 దేశాల్లో టాప్-10లో నిలిచిన ‘ధురంధర్’ పాకిస్థాన్‌లో నంబర్-1లో నిలవడం విశేషం.
News February 5, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 పడిపోయి రూ.1,41,550 పలుకుతోంది.
News February 5, 2026
హిందీ మాత్రమే నేర్చుకుంటే పానీపూరీ అమ్ముకోవాల్సిందే: మంత్రి

హిందీ వివాదం వేళ తమిళనాడు మంత్రి MRK పన్నీర్‌సెల్వం షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరాది ప్రజలు కేవలం హిందీ నేర్చుకోవడం వల్ల వారు తమిళనాడులో పానీపూరీ సెల్లర్లు, నిర్మాణ కార్మికులు, టేబుల్ క్లీన్ చేసేవారిగా స్థిరపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమిళియన్లు మాతృభాషతోపాటు ఇంగ్లిష్ నేర్చుకుని US, UKలో ఉద్యోగాలు సాధించి రూ.కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.


