News January 10, 2026
ట్రంప్‌కు నోబెల్ ఆఫర్.. స్పందించిన నార్వే కమిటీ!

తనకు లభించిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇస్తానని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో చెప్పడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందించింది. ‘నోబెల్ బహుమతిని రద్దు చేయడం, ఇతరులతో పంచుకోవడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. ఒకసారి ప్రకటన చేసిన తర్వాత అదే శాశ్వతం’ అని స్పష్టం చేసింది. 8 యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి <<18812581>>రావాల్సిందంటూ<<>> ట్రంప్ తరచూ చెబుతున్న విషయం తెలిసిందే.
Similar News
News February 7, 2026
ఐటీకి హైటెక్ సిటీ.. క్వాంటమ్‌కి అమరావతి: CBN

AP: దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో పునాది పడటం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఐటీ రెవల్యూషన్‌కి హైటెక్ సిటీ ఏం సాధించిందో, క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతి అచీవ్ చేస్తుంది. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నాం’ అని పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తామని ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రారంభోత్సవ సభలో చెప్పారు.
News February 7, 2026
AI ముప్పు: స్కిల్లింగ్ ఒక్కటే మార్గం.. CEA నాగేశ్వరన్

AI వల్ల ఉద్యోగాలకున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పుడిప్పుడే సిద్ధమవుతోందని CEA అనంత నాగేశ్వరన్ తెలిపారు. AI ప్రభావం తక్కువగా ఉండే హెల్త్‌కేర్, టూరిజం, ఆరెంజ్ ఎకానమీ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కిల్లింగ్ ద్వారానే ఈ సవాలును ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో కేవలం ప్రోత్సాహకాలు సరిపోవన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగే ఛాన్స్ ఉందన్నారు.
News February 7, 2026
ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త

ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


