News March 17, 2026

ట్రంప్‌కు భారీ షాక్

image

హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని US అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన <<19394650>>పిలుపునకు<<>> మిత్ర దేశాలు, చైనా ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు జపాన్ తేల్చిచెప్పాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచించింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Similar News

News April 5, 2026

VFXపై విమర్శలు కరెక్ట్ కాదు: హృతిక్ రోషన్

image

సినిమాల్లోని VFXను కనీస అవగాహనతో విమర్శించాలని ఆడియన్స్‌కు హీరో హృతిక్ రోషన్ సూచించారు. ‘మనం ఎన్నడూ చూడని వాటిని రామాయణ, కల్కి, బాహుబలి వంటి సినిమాలతో మేకర్స్ చూపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేస్తూ కష్టపడుతున్నారు. VFXలో చాలా స్టైల్స్ ఉంటాయి. మేకర్స్ ఎంచుకున్న స్టైల్ మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇక నుంచి VFX కథకు సరిపోయిందా? మేకర్స్ తాము అనుకున్నది చూపించారా అని కూడా ఆలోచించండి’ అని SMలో పోస్ట్ పెట్టారు.

News April 5, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News April 5, 2026

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

image

1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములురెడ్డి జననం
1908: స్వాతంత్ర్య సమర యోధుడు బాబూ జగ్జీవన్ రాం జననం (ఫొటోలో)
1942: సినీ దర్శకుడు, నిర్మాత క్రాంతి కుమార్ జననం
1974: సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి మరణం
1996: హీరోయిన్ రష్మిక మందన్న జననం
1993: నటి దివ్యభారతి మరణం
* జాతీయ సముద్ర దినోత్సవం