News March 22, 2026

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

image

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.

Similar News

News April 13, 2026

త్వరలో హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేసే మెషీన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 2 ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన యంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. BP, ECG, BMI, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షనింగ్, థైరాయిడ్‌ తదితర టెస్టులు వీటితో చేసుకోవచ్చు.

News April 13, 2026

ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ!

image

TG: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ సమస్యలు, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

News April 13, 2026

నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

image

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.