News January 17, 2026
ట్రంప్ ఆంక్షలు.. చాబహార్ పోర్టుపై భారత్ స్పందన ఇదే

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకుంటుందనే వార్తలపై విదేశాంగశాఖ స్పందించింది. US ఇచ్చిన మినహాయింపులు ఏప్రిల్ వరకు ఉన్నాయని, ఈ అంశంపై సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. మధ్య ఆసియాతో వాణిజ్యానికి ఈ పోర్టు కీలకం కానుంది.
Similar News
News February 10, 2026
PF విత్‌డ్రాకు ప్రత్యేక యాప్

UPI ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో PF సొమ్ము డిపాజిట్ అయ్యేలా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న UMANG యాప్‌నకు అదనంగా ఇది పనిచేస్తుంది. యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే 3రోజుల్లోనే గరిష్ఠంగా ₹5లక్షల వరకు డిపాజిట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకునే ఫీచర్ లేదు.
News February 10, 2026
సూర్య అద్భుతమైన కెప్టెన్: గంభీర్

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్‌పై కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘అతడు అద్భుతమైన నాయకుడు. బ్యాటర్‌గా ఓ వైపు అదరగొడుతూనే తోటి ఆటగాళ్లతో మంచి సంబంధాలను పెంచుకున్నాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు. దీంతో కోచ్‌గా నాకు ఈజీ అవుతోంది. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాను నడిపించడం గొప్ప విషయం. సూర్య ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని కొనియాడారు. USAతో మ్యాచ్‌లో సూర్య చెలరేగడం తెలిసిందే.
News February 10, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.


