News March 10, 2026

ట్రంప్ కామెంట్స్.. తగ్గిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ముగుస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన <<19341728>>వ్యాఖ్యలతో<<>> క్రూడాయిల్ ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $88కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 23% తగ్గింది. ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ట్రంప్ అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు అంతకుముందు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆయిల్ ధరలు 50% పెరిగాయి.

Similar News

News April 13, 2026

IPL: లక్నోపై గుజరాత్ ఘనవిజయం

image

లక్నో వేదికగా LSGతో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 165 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలో ఛేదించింది. బట్లర్(60), గిల్ (56) రాణించారు. ఈ సీజన్‌లో GTకి ఇది రెండో విజయం కాగా లక్నోకు రెండో ఓటమి.

News April 13, 2026

BREAKING: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు.

News April 12, 2026

సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

image

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)