News January 24, 2026
ట్రంప్ చేతికి గాయం.. అసలేమైంది?

చేతికి గాయంతో ట్రంప్ కనిపించడం చర్చనీయాంశమవుతోంది. 2 రోజుల కిందట దావోస్‌లో గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. అప్పుడు ఆయన చేతిపై గాయం కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. టేబుల్ తగలడంతో గాయమైంది. దానికి క్రీమ్ రాశా. <<18737292>>గుండె ఆరోగ్యం<<>> బాగుండాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. గాయాలు కావద్దనుకుంటే ఆస్పిరిన్ తీసుకోవద్దు’ అని ట్రంప్ అన్నారు.
Similar News
News February 15, 2026
టెన్త్ పరీక్షలకు వైభవ్ సూర్యవంశీ దూరం

భారత U19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టెన్త్ పరీక్షలకు హాజరవుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావట్లేదని స్కూల్ డైరెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ చెప్పారని పేర్కొన్నారు. వరుస టోర్నమెంట్లు, ట్రైనింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇటీవల జరిగిన U19 WCలో వైభవ్ 7 మ్యాచుల్లో 439 రన్స్ చేసి సత్తా చాటారు.
News February 15, 2026
$6.7B తగ్గిన విదేశీ మారక నిల్వలు

ఈ నెల 6తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $6.711 బిలియన్లు తగ్గి $717.064Bకి చేరినట్లు RBI వెల్లడించింది. బంగారం నిల్వలు $14.208B తగ్గి $123.476B చేరడమే ఇందుకు కారణం. అంతకుముందు వారం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రిజర్వ్స్ రికార్డు స్థాయిలో $723.774Bకి పెరిగాయి. ఇప్పుడు కాస్త తగ్గినా మొత్తంగా బలంగానే ఉన్నాయని RBI పేర్కొంది. అటు విదేశీ కరెన్సీ ఆస్తులు $570.053Bకి పెరిగాయని తెలిపింది.
News February 15, 2026
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.


