News January 4, 2026
ట్రంప్ తర్వాతి టార్గెట్ ఆ 3 దేశాలేనా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన జోష్‌లో ఉన్న US అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో, క్యూబా, కొలంబియాకూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోను డ్రగ్ ముఠాలు నడుపుతున్నాయని, కొలంబియా కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ఆ దేశాల్లోనూ ఏదో ఒకటి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన లాటిన్ అమెరికా దేశాల్లో కలకలం రేపుతోంది.
Similar News
News February 6, 2026
కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్‌ను ఎగదోస్తోందని ఆరోపించారు.
News February 6, 2026
మచిలీపట్నం హైవే కారిడార్‌కు ఫండ్స్.. గడ్కరీకి లోకేశ్ థాంక్స్

AP: మచిలీపట్నం పోర్టు రోడ్డును NH-216 జంక్షన్‌కు అనుసంధానించే 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి గడ్కరీ SMలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పోర్టు నుంచి హైవేకు సరకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం సహకరిస్తున్న గడ్కరీకి ధన్యవాదాలు అని ఆయన పోస్ట్‌కు మంత్రి లోకేశ్ రిప్లై ఇచ్చారు.
News February 5, 2026
గుండెపోటు రావొద్దంటే ఇవి తినాల్సిందే!

ధమనుల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో అవి బ్లాక్ అయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఓట్స్, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. టమాటాల్లోని విటమిన్ C, E, ఫ్లేవనాయిడ్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవరూ ఎంతగానో దోహదపడతాయి. చేపలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.


