News January 9, 2026
ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.
Similar News
News February 6, 2026
స్మృతి మంధాన ‘రాయల్’ విజయం!

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు కుంగిపోకుండా, పట్టుదలతో పోరాడి RCBని మరోసారి విజేతగా నిలిపారు స్మృతి మంధాన. మానసిక వేదనను పక్కన పెట్టి, మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకోవడం ఆమె సంకల్పానికి నిదర్శనం. పడిలేచిన కెరటంలా పుంజుకున్న ఆమె ప్రయాణం.. నిరాశలో కూరుకుపోతున్న ఎందరికో ఆదర్శం. ఈ విజయం కప్పు మాత్రమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసానికి అభిషేకం.. మనోనిబ్బరానికి మరో మజిలీ.!
News February 6, 2026
ముహూర్తం కోసం చూస్తున్నా.. 3 నెలల్లో పార్టీ ప్రకటన: కవిత

TG: పార్టీ ప్రకటనపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘నాకు సెంటిమెంట్ ఎక్కువ. మంచి ముహూర్తం కోసం చూస్తున్నా. 3 నెలల్లో పార్టీని ప్రకటిస్తా. సిరిసిల్లలో 16 మంది BRS నేతలు టికెట్ కోసం మమ్మల్ని కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో KTR, హరీశ్‌రావు కేవలం జాగృతి బరిలో ఉన్న చోటే తిరుగుతున్నారు. ఇతర జిల్లాల్లో ఎందుకు ప్రచారం చేయట్లేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు.
News February 6, 2026
ప్రత్యామ్నాయాలు చూసుకోండి.. కోడర్స్‌కు వెంబు హెచ్చరిక

ప్రపంచమంతా AI యుగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కోడింగ్‌పై ఆధారపడే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన సమయం వచ్చిందని జోహో కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. కోడింగ్ తెలియని వారు కూడా AIతో యాప్స్ తయారు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మార్పుని అంగీకరించాలని సూచించారు. AI బాధితుల జాబితాలో తాను కూడా ఉన్నానని తెలిపారు.


