News January 18, 2026

ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

image

ట్రంప్‌నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్‌ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్‌ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.

Similar News

News February 18, 2026

అంబటికి బెయిల్

image

AP: YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ ఆయనపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైైంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా CBNను దూషించిన కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News February 18, 2026

కూరగాయలు తాజాగా ఉండాలంటే?

image

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్‌ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.

News February 18, 2026

డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

image

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్‌కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it