News March 4, 2026
ట్రంప్ ‘వీకెండ్’ వార్స్ వెనక ‘మార్కెట్’ ప్లాన్!

ట్రంప్ హయాంలో జరిగిన ప్రధాన దాడులన్నీ (ఇరాన్, వెనిజులా, నైజీరియా) శని, ఆదివారాల్లోనే కావడం గమనార్హం. దీని వెనక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వీకెండ్స్‌లో స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో యుద్ధంపై ఇన్వెస్టర్లు వెంటనే స్పందించి షేర్లను అమ్మకుండా ఉంటారు. సోమవారం మార్కెట్లు తెరిచే నాటికి ఓ అంచనా వచ్చి భారీ పతనం తప్పుతుంది. ఈ 48 గంటల్లో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ చూసుకునే అవకాశం ఉంటుంది.
Similar News
News March 5, 2026
421 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే అవకాశం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 421 పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(మార్చి 8) అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/
News March 5, 2026
రాష్ట్రానికి భారీ వర్షసూచన!

TG: రాష్ట్రంలో ఈ నెల 18/19 తర్వాత మరోసారి అన్‌సీజనల్ రెయిన్స్‌కు ఆస్కారముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెల 23-24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే భారీగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే అప్పటి వరకూ ఎండలు తీవ్రంగా ఉంటాయని, 40+°C టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 36-37°C మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేశారు.
News March 5, 2026
ట్రంప్‌కు షాక్.. వసూలు చేసిన టారిఫ్స్ రిఫండ్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు US ట్రేడ్ కోర్ట్ షాకిచ్చింది. కంపెనీల నుంచి వసూలు చేసిన అదనపు టారిఫ్‌ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఎమర్జెన్సీ పవర్ లా కింద టారిఫ్స్ చెల్లించిన అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుందని, రిఫండ్‌కు వారు అర్హులని స్పష్టం చేసింది. ఈ మొత్తం $175B ఉంటుందని అంచనా. కాగా అంతకుముందు ట్రంప్ టారిఫ్స్‌ను US సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.


