News March 1, 2026
ట్రంప్.. శాంతి శాంతి అంటూనే..

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక శాంతి కోరుకుంటున్నా అంటూనే దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టాక 8 దేశాలపై దాడులు చేశారు. అందులో ఇరాన్, వెనిజులా, లాటిన్ అమెరికా, నైజీరియా, సోమాలియా, యెమెన్, సిరియా, ఇరాక్ ఉన్నాయి. ఇరాన్‌లో గతేడాది 12 రోజుల యుద్ధంలో 600 మంది మరణించగా ఇప్పుడు 201 మంది చనిపోయారు. వెనిజులాలో 83 మంది, లాటిన్ అమెరికాలో 151 మంది, యెమెన్‌లో 80 మంది మరణించారు.
Similar News
News March 1, 2026
ఫోన్‌లో సిమ్ ఉంటేనే ఈ యాప్స్ పనిచేస్తాయి!

ఇవాళ్టి నుంచి కొత్త టెలికం నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్‌తో కచ్చితంగా లింక్ అయి ఉండాలి. 6 గంటలకు ఒకసారి యాప్‌లు మీ ఫోన్‌లో సిమ్ ఉందో లేదో చెక్ చేస్తాయి. ఒకవేళ సిమ్ తీసివేస్తే అవి పనిచేయవు. అలాగే ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి రీఅథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.
News March 1, 2026
తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.
News March 1, 2026
NCERTలో 117 ఉద్యోగాలు

NCERTలో 117 అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 6 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil, అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncert.nic.in


