News February 5, 2026
ట్రక్ & బస్ డ్రైవర్ల కుమార్తెల కోసం స్కాలర్‌షిప్

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ సంస్థ మహీంద్రా సారథి అభియాన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ట్రక్ డ్రైవర్ కుమార్తె అయి, 11వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ఆదాయం 4 లక్షల్లోపు, 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ పథకం ద్వారా పదివేలు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2026. వెబ్‌సైట్: <
Similar News
News February 15, 2026
రాష్ట్ర పురోగతికి రోడ్ మ్యాప్ అందించిన బడ్జెట్: మాధవ్

AP: ₹3.32L కోట్లతో బడ్జెట్ ప్రతిపాదన సాహసోపేతమని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొనియాడారు. ఇదొక ప్రగతిశీల బడ్జెట్ అని పేర్కొన్నారు. ‘సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా రూపొందించిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి రోడ్ మ్యాప్ అందించింది. వికసిత్ ఏపీ ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి’ అని కార్యకర్తలకు సూచించారు.
News February 15, 2026
జనజీవన స్రవంతిలోకి రండి.. మావోలకు TG పోలీస్ పిలుపు

TGలోని అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ ‘సరెండర్&రిహాబిలిటేషన్’ పాలసీ కింద తక్షణ ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని DGP శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు.
News February 15, 2026
T20 WC: USA భారీ స్కోర్

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.


