News April 4, 2025
ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలి: జనగాం కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారో ఆ రాకపోకలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
Similar News
News April 4, 2025
జగిత్యాల: చీఫ్ ప్లానింగ్ అధికారినిగా ఉమారాణి

జగిత్యాల జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారినిగా ఉమారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్‌లో పని చేస్తున్న ఉమారాణి జగిత్యాలకు బదిలీ అయ్యారు. జగిత్యాల పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణిని పలువురు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
News April 4, 2025
అధ్యక్ష పదవికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే నామినేషన్

విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 38 నామినేషన్లు వేసినట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజుతో పాటు సినీ నిర్మాత కేఎస్ రామారావు కూడా పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పరశురామ రాజు తదితరులు పాల్గొన్నారు.
News April 4, 2025
విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ

TG: పాల సేకరణ ధరల్లో విజయ డెయిరీ సవరణ చేసింది. 7% వెన్న ఉన్న గేదె పాల ధరను లీటర్‌కు రూ.56 నుంచి రూ.59.50కు, 10% వెన్న ఉంటే రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. 3% వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటి వరకు లీటర్‌కు రూ.40 ఉండగా రూ.36.50కు తగ్గించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. గేదె పాలు విక్రయించే రైతులకు లబ్ధి చేకూరనుండగా, ఆవు పాలు అమ్మే వారికి కాస్త నష్టం కలగనుంది.