News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

image

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.

News November 8, 2025

కనకదాసు చిత్ర పటానికి SP నివాళి

image

భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ శనివారం నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించి విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సమానత్వానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం కుల, మత తేడాలను చెరిపివేసేలా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా, 1 టౌన్ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.

News November 8, 2025

రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు

image

రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్(84) గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ICUలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలియగానే రజినీకాంత్ హుటాహుటిన చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.