News January 14, 2026
ట్రాఫిక్ జామ్ ఇక గతం: భాగ్యనగరంలో త్వరలో నయా ‘హైవే’ మ్యాజిక్!

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూస్తున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గోల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
Similar News
News February 20, 2026
మదనపల్లెలో ఏం జరుగుతోంది..?

మదనపల్లె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతోంది. కిడ్నీ రాకెట్, కల్తీ మద్యం, ఫైల్స్ దగ్ధం, హత్యాచారం, గంజాయి విక్రయాలు వంటి నేరాలు జరుగుతున్నాయి. నేర ప్రవృత్తిని ఎంత తగ్గించాలని పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఇక్కడ ఉండే రౌడీలు, కిరాయి గూండాలను బెంగళూరులో దందాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News February 20, 2026
సిద్దిపేటం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశలు, నిలిచిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంజూరైన ఇల్లు గ్రౌండింగ్ కావాలని, ఎంపీడీఓలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు పూర్తయ్యే దశలో ఫోటో క్యాప్చర్ చేయాలని తెలిపారు.
News February 20, 2026
TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.


