News August 5, 2024
ట్రావెల్ బస్సులో చోరీ.. 3కిలోల బంగారం రికవరీ: ఎస్పీ రూపేశ్

సత్వర్ డాబా వద్ద ఓ ట్రావెల్ బస్సులో జరిగిన చోరీలో రూ.3.10 కోట్ల విలువ చేసే 3 కిలోల బంగారం రికవరీ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని దార్వాడ పూర్‌కు చెందిన ముస్తాక్(40)ని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.
Similar News
News February 18, 2026
ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
News February 17, 2026
శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 17, 2026
సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బంజారా సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి పలు సూచనలు చేశారు.


