News July 11, 2024

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు ఇవే.!

image

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ తేదీలను ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ఆచార్య కేసీరెడ్డి ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 22, 23 తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 26, 27 తేదీల్లో శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Similar News

News October 31, 2025

కార్తీక మాసానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభం

image

కార్తీకమాసంలో శైవక్షేత్రాలను దర్శిస్తే అపారమైన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు పంచారామాలు, అరుణాచలం, యాగంటి, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం, వాడపల్లి వంటి ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.

News October 31, 2025

కాలువల్లో అడ్డంకులు తొలగిస్తున్నాం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పొలాలలోని నీటిని బయటకు పంపేందుకు మురుగు కాలువలకు అడ్డంకులు తొలగించే విధంగా అవసరమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి నుంచి RTG, HRD విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు.

News October 31, 2025

తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు: ఎస్పీ హెచ్చరిక

image

పత్రికా స్వేచ్ఛ ముసుగులో ప్రభుత్వ వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో అవనిగడ్డ మండలం రామకోటిపురం సర్పంచ్‌ను ఫొటో ఎగ్జిబిషన్ వద్ధకు రానివ్వలేదని ఓ పత్రిక ప్రచురించిన వార్తపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంక్షలను వక్రీకరించి తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.