News February 4, 2026

ట్రేడ్ డీల్ ఖరారు.. అమెరికాలో జైశంకర్ బిజీ

image

IND-US ట్రేడ్ డీల్ ఖరారవడంతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు. వాషింగ్టన్‌లో US సెక్రటరీ రూబియో, ట్రెజరీ సెక్రటరీ బెసెంట్‌లతో భేటీ అయ్యారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్‌తో సహకారంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇంధన భద్రత, కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

Similar News

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

image

AP: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్‌కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు అంతరాయం కలిగించడానికి ఎయిర్‌పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్‌పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News February 21, 2026

వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.

News February 21, 2026

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.