News February 3, 2026
ట్రేడ్ డీల్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ల ధమాకా

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2072 పాయింట్ల లాభంతో 83,739కు చేరగా నిఫ్టీ 639 పాయింట్లు ఎగసి 25,727 వద్ద సెటిల్ అయింది. భారత్-US ట్రేడ్ డీల్‌పై ట్రంప్ ప్రకటన, US టారిఫ్స్ ఇప్పుడు పొరుగు దేశాలకంటే భారత్‌పై తక్కువ ఉండటం, రూపీ విలువ మెరుగవడం, ఆసియా మార్కెట్ల జోరు, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లలో జోష్ నింపాయి. SENSEX 30లో అదానీపోర్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది.
Similar News
News February 10, 2026
చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుడ్డులోని పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

గుడ్డు పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది ఎగ్ వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కీలక పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలోని 85% కొలెస్ట్రాల్‌ను కాలేయమే ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ ప్రభావం తక్కువే. పచ్చసొనలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.