News October 30, 2025
ట్రైనింగ్ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జితేష్

ఫర్నిచర్ అసిస్టెంట్ 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.
Similar News
News October 31, 2025
జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేటి వరకు జిల్లాలో 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించడంతోపాటు, ఈరోజు వరకు మొత్తం 29,100 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను కొన్నామన్నారు.
News October 31, 2025
దస్తూరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రేవోజిపేట గ్రామంలోని కొత్త పల్లెలోని ముప్పిడి రాధ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
News October 31, 2025
నిర్మల్: రేపు జిల్లా వ్యాప్తంగా 2కే రన్ కార్యక్రమం

శుక్రవారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులందరూ 2కే రన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 2కే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.


