News December 14, 2025
ట్విన్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇబ్బందులివే..

ఒకే కాన్పులో ట్విన్స్ పుడితే బావుంటుందని అందరూ భావిస్తారు. కానీ దీనివల్ల పెరినాటల్ అనారోగ్యం, మరణాల ప్రమాదం, అలాగే నెలలు నిండకుండానే ప్రసవం వంటి ప్రసూతి సమస్యలకు దారి తీస్తాయంటున్నారు నిపుణులు. అయితే సరైన శ్రద్ధ, సంరక్షణతో ఆరోగ్యకరమైన ట్విన్ ప్రెగ్నెన్సీ పొందడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో మెటర్నిటీ బెల్ట్, బెల్లీ బ్యాండ్స్ వాడాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.
Similar News
News December 17, 2025
మొబైల్ ఫోన్లు కొనేవారికి షాక్!

వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం మొబైల్ ర్యామ్ కంటే AI సర్వర్ల చిప్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. హైఎండ్ DRAM వంటి కాంపోనెంట్స్ వాడటంతో ఫోన్ల ధరలూ పెరగొచ్చు. ఫోన్లలో 16GB RAM వేరియంట్లు కనుమరుగై గరిష్ఠంగా 12GBకే పరిమితం కావొచ్చు’ అని తెలిపారు. కాగా APPLE తన ఫోన్లపై ₹7వేలు, మిగతా కంపెనీలు ₹2వేల వరకూ పెంచనున్నాయి.
News December 17, 2025
ఈ రెండ్రోజులు శివారాధన చేస్తే?

శివారాధనకు నేడు(బుధ ప్రదోషం), రేపు(మాస శివరాత్రి) ఎంతో అనుకూలమని పండితులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం బుధ ప్రదోష వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. ఫలితంగా బుధుడి అనుగ్రహంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం, వాక్పటిమ పెరుగుతాయని అంటున్నారు. మార్గశిర మాస శివరాత్రి రోజున చేసే శివ పూజలతో పాపాలు నశించి, కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ప్రదోష, శివరాత్రి పూజల విధానం, టైమింగ్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 17, 2025
తరచూ ఇల్లు మారుతున్నారా?

చాలామంది కెరీర్, ట్రాన్స్‌ఫర్లు, పిల్లల చదువుల కోసం ఊళ్లు మారుతూ ఉంటారు. అయితే తరచూ ఇళ్లను మారడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో తరచూ ఇళ్లు మారుతోంటే పెద్దయ్యాక వాళ్లు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లలకు చిన్నతనంలో స్థిరమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందంటున్నారు.


