News February 1, 2026
‘డబుల్ హ్యాపీ’ కవలలు పుట్టాక RC ఫస్ట్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు <<19016319>>కవలలు<<>> జన్మించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా బాబు, ఆ తర్వాత పాప పుట్టినట్లు వైద్యులు తెలిపారు. రామ్‌చరణ్ తమ సంతోషాన్ని SM ద్వారా పంచుకుంటూ తన జీవితంలోని మహిళలే తనకు కొండంత బలమని రాసుకొచ్చారు. ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉందన్నారు. తమను ఆదరిస్తున్న అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది.
Similar News
News February 19, 2026
ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.
News February 19, 2026
కాంగ్రెస్ బడ్జెట్ కూతురికి జన్మనివ్వడం లాంటిది: రాజస్థాన్ BJP ఎమ్మెల్యే

రాష్ట్ర బడ్జెట్‌ను కొడుకు, కూతురితో పోలుస్తూ రాజస్థాన్ BJP MLA బహదూర్ సింగ్ కోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘BJP ప్రభుత్వం 3 బడ్జెట్లలో కొడుకులకు జన్మనిచ్చింది. కానీ గత కాంగ్రెస్ బడ్జెట్ మాత్రం కూతురికి జన్మనివ్వడం లాంటిది. మాది యువకులకు ఉద్దేశించినది. కానీ కాంగ్రెస్‌ది వృద్ధాప్యానికి సంబంధించినది. కొడుకు అంటే ఉపయోగకరం. కాంగ్రెస్‌కు కొడుకు పుట్టలేదు. అందుకే ప్రతిపక్షంలో ఉంది’ అని సభలో అన్నారు.
News February 19, 2026
మా ఆయిల్ ఇండియా కొనదని US చెబితే నమ్మాలా: రష్యా

రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లు ఆపేందుకు ఇండియా <<19145614>>ఒప్పుకుందని<<>> అమెరికా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా వైఖరి మార్చుకుందని తాము నమ్మడం లేదని రష్యా తెలిపింది. ‘మా హైడ్రోకార్బన్లను కొనడం 2 దేశాలకు ప్రయోజనం. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో సాయపడుతుంది’ అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా అన్నారు. US వాదనల్లో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు.


